అల్లుడికి మెగాస్టార్ కాస్ట్లీ గిఫ్ట్

chiru vaishav
మెగా కుటుంబం నుండి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్. డెబ్యూ సినిమాతోనే కొత్త రికార్డుల్ని క్రియేట్ చేశాడు ఈ కుర్రాడు. ‘ఉప్పెన’తో ఏ డెబ్యూ హీరోకీ సాధ్యంకాని వసూళ్లను రాబట్టుకున్నాడు. మొదటి నుండి సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది. దానికితోడు సినిమాలో స్టఫ్ ఉండటంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు లాభాల పంట పండించింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం భారీ లాభాల్ని మూటగట్టుకుంటున్నారు.

ఇలా మొదటి సినిమాతోనే ఇంతటి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ కు మెగా ఫ్యామిలీ హీరోలంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రతి దశలోనూ సినిమాకు అండగా నిలబడ్డారు. ఆయన మాటలతోనే సినిమా మీద హైప్ పెరిగింది. చిరు సైతం అల్లుడు ఆ స్థాయి హిట్ కొట్టడంతో చాలా సంతోషిస్తున్నారు. ఈ సందర్బంగా అల్లుడికి ఒక క్లాస్ట్లీ రిస్ట్ వాచ్ బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని వైష్ణవ్ తేజ్ సోషల్ మీడియాలో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిరు కొన్నిరోజుల క్రితం చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీకి సైతం ఒక అందమైన బహుమతిని పంపిన సంగతి తెలిసిందే.

Exit mobile version