మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌కు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో చిరు తమ్ముడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపాడు.
దానికి రెస్పాన్స్‌గా చిరు తన తమ్ముడిపట్ల వ్యక్తపరిచిన ప్రేమానురాగాలు, బంధాన్ని తెలియజేస్తూ రాసిన ఎమోషనల్ మెసేజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ పంపిన జ్ఞాపకాల కానుకకు స్పందిస్తూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన రెస్పాన్స్ పంచుకున్నాడు. ‘నువ్వు ప్రేమ, త్యాగంగా భావిస్తున్నది ఒక అన్నగా నా బాధ్యత, అనురాగం మాత్రమే. సమాజం పట్ల నీకున్న అచంచలమైన ధైర్యం, దేశం పట్ల నీకున్న నిబద్ధత చూస్తుంటే ఒక అన్నగా నా గుండె గర్వంతో నిండిపోతోంది. నేడు నువ్వు కోట్లాది మందికి స్ఫూర్తిగా, కొండంత కొండగా నిలిచావు’ అని చిరంజీవి కొనియాడారు.
చిరంజీవి తన సందేశాన్ని కొనసాగిస్తూ, ‘నన్ను నీ హీరో అని పిలుస్తుంటావు, కానీ నీలోని పట్టుదల, నిజాయితీ, స్వార్థం లేని నీ ప్రయాణం నన్ను కూడా ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి, స్ఫూర్తినిచ్చాయి. ఈ తీపి జ్ఞాపకాల కానుకను అందించినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ బాబు. నీ ప్రేమాభిమానాలు నా జీవితంలో దక్కిన గొప్ప ఆశీర్వాదాలు’ అని పేర్కొన్నారు. మెగా బ్రదర్స్ మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం, అభిమానం వారి అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the… https://t.co/4A1h9OyGZO
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 22, 2026


