మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో చిరు దేవాదాయ సఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం టీమ్ భారీ టెంపుల్ టౌన్ సెట్ నిర్మించారు. ఇది ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్. సినిమా బడ్జెట్లో అత్యధిక మొత్తం ఖర్చు పెట్టింది ఈ సెట్ కోసమే. ఇదివరకు తెలుగులో ఇలాంటి భారీ సెట్ వేసింది లేదని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటోంది. చిన్న చిన్న వివరాలను కూడ వదలకుండా చాలా పక్కాగా సెట్ నిర్మించారు కళా దర్శకులు సురేష్ సెల్వరాజ్.
ఈ సెట్ విశేషాలను సినిమా విడుదలకు ముందే మెగాసస్టార్ చిరు ప్రేక్షకులతో పంచుకున్నారు. సెట్ మొత్తాన్ని తన కెమెరాలో బంధించిన ఆయన 20 ఎకరాల్లో వేసిన సెట్లో విశేషాలైనా గాలిగోపురం, గుడి సింహ ద్వారాలను చూపించారు. ఆ వీడియో చూస్తే సెట్ భారీతనం ఏంటో తెలుస్తోంది. ఈ సెట్లో తీసిన ప్రతి సన్నివేశం విజువల్ వండర్ అవబోతుందని అనిపిస్తోంది. ఇందులో నిర్మాతలు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సినిమా కోసం వెనుకాడకుండా పెట్టిన ఖర్చు కనిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడ ఒక కీలక పాత్రలో నటించగా కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటించింది. సినిమాను ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకులకు అందివ్వాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn't stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021
