ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న శుభాకాంక్షలు అభిమానులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్నతనం నుంచే ‘కళ్యాణ్ బాబు’లో ఉన్న నిబద్ధత, ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధిని దగ్గరుండి చూశానని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
కుటుంబంపై ఎంతటి ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపై కూడా అంతే వాత్సల్యం చూపే గుణం పవన్‌ది అని, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారని కొనియాడారు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకెళ్తున్న తమ్ముడి తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడని ప్రశంసించారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ తమ్ముడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ్ముడికి అన్నయ్య చెప్పిన ఈ స్పెషల్ బర్త్ డే విషెస్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో… pic.twitter.com/FEFdNToZ9a
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2026


