‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ పై ప్రేక్షక దేవుళ్లకు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్..!

Mana Shankara Vara Prasad Garu

సంక్రాంతి 2026 కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన చిత్రాలు అన్ని కూడా మంచి టాక్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రానికి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో వింటేజ్ చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు.

దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఫలితంగా ఈ మూవీ సాలిడ్ వసూళ్లను రాబడుతూ రెండో వారం కూడా స్ట్రాంగ్ హోల్డ్‌తో రన్ అవుతోంది. ఇక ఈ చిత్రానికి ప్రేక్షకులు అందించిన విజయంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఓ లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరిచిపోలేనిదని.. వారు చూపిస్తున్న రెస్పాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం పూర్తిగా తెలుగు ప్రేక్షకులదని.. తనపై ఇన్నేళ్లుగా అభిమానం, ప్రేమ కురిపిస్తున్న అభిమానులదని.. తనతో పాటు తన చిత్ర యూనిట్ పై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్ లెటర్ రాసుకొచ్చారు.

Exit mobile version