చిరు ముఖ్య అతిధిగా రజినీ ‘లింగ’ తెలుగు ఆడియో.?

Chiru_Linga
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ – కమర్షియల్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లింగ’. ఈ సినిమా డిసెంబర్ 12న భారీ ఎత్తున విడుదలకి సిద్దమవుతోంది. లింగ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ నెల 8 నుంచి తెలుగులో కూడా ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ హైదరబాద్ లో చేయనున్నారని తెలియజేశాం. అందులో భాగంగా ముందుగా ఈ సినిమా తెలుగు ఆడియోని రేపు రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, అతని టీం ఇప్పటికే హైదరబాద్ చేరుకున్నారు. ఈ ఆడియో రిలీజ్ కి రజినీకాంత్ తో పాటు, అనుష్క, సోనాక్షి సిన్హా, ఎఆర్ రెహమాన్, కెఎస్ రవికుమార్ తదితరులు హాజరవుతున్నారు. ప్రస్తుతం మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ చిరంజీవి తనకున్న బిజీ షెడ్యూల్స్ లో ఈ ఆడియో లాంచ్ కి టైం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకే స్టేజ్ పై ఇద్దరు సూపర్ స్టార్స్ చూడడం కన్నుల పండుగగా ఉంటుంది.

చెప్పాలంటే ఈ సినిమా ఆడియో డైరెక్ట్ గా మార్కెట్ లోకి వచ్చేసింది కానీ ప్రమోషన్స్ కోసం ఇప్పుడు ఓ పెద్ద ఈవెంట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

Exit mobile version