మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమాల్లో ఒకటే దర్శకుడు వశిష్ఠతో చేసిన విశ్వంభర. ఎన్నో ఏళ్ళు తర్వాత చిరు నుంచి ఓ సాలిడ్ స్ట్రెయిట్ సినిమా పైగా ఫాంటసీ జానర్ లో సినిమా కావడంతో అంచనాలు బాగా పెరిగాయి. కానీ సినిమా మాత్రం అంతకంతకూ ఆలస్యం అవుతూ వచ్చింది.
పైగా విడుదల కూడా ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారడంతో అభిమానుల్లో కూడా అంచనాలు నెమ్మదిగా సన్నగిళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం చిరు చేస్తున్న ‘కాకా’ విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది.
కానీ విశ్వంభర ఓటీటీ డీల్ పూర్తి కావడంతో ఈ సినిమా కూడా సంక్రాంతి టార్గెట్ గానే వస్తుంది అన్నట్టు టాక్ ఊపందుకుంది. ఇదిలా ఉంటే కాకా మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతి కి మిస్ అయ్యేది లేదు అన్నట్లుగా ఆ సినిమా యూనిట్, దర్శకుడు పని చేస్తున్నారు. పైగా అప్పుడే ఫస్ట్ సింగిల్ విడుదల అని కూడా అంటున్నారు.
సో దీనితో విశ్వంభర విడుదల పరిస్థితి మరింత టైట్ గా మారిపోతుంది. వస్తే ముందో లేకపోతే ఆ తర్వాత రావడమే కానీ సంక్రాంతి బరిలో మాత్రం కాకా యూనిట్ వెనక్కి వెళ్లే సూచనలు చూపట్లేదు. మరి ఈ ఆసక్తికరమైన పరిస్థితిని ఎలా రెండు సినిమాల యూనిట్ లు ఎలా పరిష్కరిస్తాయో చూడాలి మరి.
