
తెలుగు చిత్ర పరిశ్రమకి ఆగష్టు 22వ తేదీని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆ రోజు. ప్రతి ఏడాది ఈ పుట్టిన రోజున ఇండస్ట్రీలో పలు సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి, అంతే కాకుండా మెగా అభిమానులు ఇరు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది చిరంజీవి తన 60వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాడు.
రాజకీయ ప్రవేశం తర్వాత ఇండస్ట్రీకి కొంతలో కొంత దూరమైన చిరంజీవి మళ్ళీ పూర్తిగా ఇండస్ట్రీతో కలిసి జర్నీ చెయ్యడానికి సిద్దమయ్యారు. దాంతో మెగాస్టార్ ఈ 60వ పుట్టిన రోజు వేడుకని సినీ ప్రముఖులతో కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అందుకే చిరు తన 60వ బర్త్ డే బాష్ కి గ్రాండ్ అరేంజ్ మెంట్స్ చేస్తున్నాడు.
మెగాస్టార్ 60వ పుట్టిన రోజు వేడుకని ఆగష్టు 22వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో చాలా గ్రాండ్ గా చేయడానికి నిర్ణయించారు. అందుకోసమే స్పెషల్ ఇన్విటేషన్స్ ని తయారు చేసి ఇండస్ట్రీలోని ప్రముఖులందరికీ అందిస్తున్నారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు అతని సతీమణి ఉపాసన దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్ చిరు బర్త్ డే కానుకగా ఓ స్టన్నింగ్ గిఫ్ట్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకకి సంబందించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడం కోసం 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.