మెగాస్టార్ కొత్త సినిమా.. అవి రూమర్స్ మాత్రామే ?

Chiru koratala

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలైన ‘సైరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సైరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక చిరు చిన్న విరామం తరువాత, కొరటాల మూవీని స్టార్ట్ చేయనున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని ఆ రూమర్స్ సారాంశం. కాగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట.

ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.

Exit mobile version