ఆ దర్శకుడంటే భయపడుతున్న చిరు ఫ్యాన్స్..!

chiru mehar ramesh
దర్శకుడు మెహర్ రమేష్ తో మెగాస్టార్ చిరంజీవి మూవీ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. 2015లో విడుదలై భారీ హిట్ అందుకున్న వేదాళం మూవీ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నారట. అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన ఆ చిత్రం భారీ విజయం అందుకోవడం జరిగింది. దీనితో ఆ మూవీపై చిరు మనసు పారేసుకున్నారట. ఐతే ఆ మూవీ దర్శకుడుగా మెహర్ రమేష్ వ్యవహరించనున్నారట. ఐతే ఈ విషయమే చిరు ఫ్యాన్స్ ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది.

మెహర్ రమేష్ ట్రాక్ చూస్తే ఎవరైనా ఆయనతో మూవీ చేయడానికి భయపడతారు. కారణం ఆయన తెలుగులో నాలుగు సినిమాలు చేస్తే బిల్లా మాత్రమే ఓ స్థాయి విజయాన్ని అందుకొంది. ఆయన ఎన్టీఆర్ తో చేసిన కంత్రి, శక్తి, వెంకటేష్ తో చేసిన షాడో డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో వేదాళం రీమేక్ దర్శకుడిగా మెహర్ రమేష్ అంటే ఫ్యాన్స్ భయపడుతున్నారట.

Exit mobile version