సైరా నేడు విడుదలైన అద్బుతమమైన స్పందన అందుకొంటుంది. అటు మూవీ క్రిటిక్స్, ఇటు సాధారణ ప్రేక్షకులు సైరా పై ప్రసంశలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్ వేదికగా సైరా మూవీని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిరు నివాసంలో కలిసి విజయాన్ని జరుపుకోవడం జరిగింది.
రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే సినిమా విడుదలకి ముందు చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఎప్పటినుండో భగత్ సింగ్ పాత్రను చేద్దామని అనుకున్నానని కానీ అలాంటి కథతో దర్శక నిర్మాతలు నా ముందుకు ఎవరు రాలేదని చిరు అన్నారు. ఇక ఆ పాత్ర చేయలేననే ఫీలింగ్ కలుగుతోందని, భగత్ సింగ్ పాత్రను చరణ్ చేస్తే బాగుంటుందనేది తన అభిప్రాయమని చిరు అన్నారు. పనిలో పనిగా తన డ్రీం ప్రాజెక్ట్ లో నటించే బాధ్యత చిరు కొడుకు చరణ్ కి అప్పగించాడని సినీ జనాలు అనుకుంటున్నారు.
