చిరు-కొరటాల మూవీ అప్డేట్

Chiru koratala

దసరా పండుగ అంటేనే కొత్త పనులకు నాంది పలకడానికి అనువైన తరుణంగా భావిస్తారు. అందుకే ఈ పండుగకు కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం భారతీయుల ఆనవాయితీ. ఇక సెంటిమెంట్స్ ని పీక్స్ లో ఫాలో అయ్యే చిత్ర పరిశ్రమ గురించి చెప్పాల్సిన పనిలేదు. అనేక కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం మరియు ఆల్రెడీ మొదలైన చిత్రాల అప్డేట్స్ ఇవ్వడం చేస్తారు. కాగా చిరంజీవి, కొరటాల శివల మోస్ట్ అవైటింగ్ మూవీ ప్రారంభ పూజా కార్యక్రమాలు కూడా విజయదశమి సంధర్భంగా రేపు మొదలుపెట్టనున్నారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సోషల్ మెస్సేజ్ మూవీస్ తీయడంలో నిపుణుడైన కొరటాల , చిరు కొరకు కూడా అలాంటి కథనే ఒకటి సిద్ధం చేశారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంహీరోయిన్ , నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Exit mobile version