సైరా ఘనవిజయంతో అటు మెగాఫ్యామిలీ తో పాటు మెగా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా సైరా పై కురుస్తున్న అభినందనల వెల్లువను చిరు మరియు చరణ్ తో పాటు, చిత్ర యూనిట్ ఆస్వాదిస్తున్నారు. సైరా పై ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అభిమానానికి కృతఙ్ఞతలు తెలుపడానికి నేడు చిత్ర యూనిట్ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్ లతో పాటుగా దర్శకుడు సురేంధర్ రెడ్డి, నటుడు జగపతి బాబు, తమన్నా, సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా, రత్నవేలు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా సైరాలో భాగమైన నటులకు, సాంకేతిక నిపుణులకు మరియు ప్రేక్షకులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఐతే ముఖ్యంగా స్వీటీ అనుష్కపై చిరు ప్రశంసలు కురిపించారు. అమితాబ్ వలే అనుష్క కూడా రెమ్యూనరేషన్ ఏమీ ఆశించకుండా రామ్ చరణ్ అడిగిన వెంటనే అమెరికా నుండి వచ్చి నటించి వెళ్లారని చెప్పుకొచ్చారు. సభాముఖంగా నటి అనుష్కకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
