చిత్రలహరి షూటింగ్ అప్డేట్ !

Chitralahari1

నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ నటిస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ ముంబై లోని మెరైన్ డ్రైవ్ లో జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఈచిత్రం 80 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రపీ అందిస్తున్నా ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది. ఇక ఈచిత్ర విజయం తేజు , కిశోర్ తిరుమల అలాగే మైత్రి కి చాలా కీలకం కానుంది. సరిగమ సినిమాస్ ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుంది.

Exit mobile version