ఓటిటి సమీక్ష: ‘సిబిల్ స్కోర్ పెళ్లి కొడుకు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటీటీ వేదిక : ఈటీవీ విన్

ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : 2 ఆగస్టు, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ 3/5

నటీనటులు : దేవీ ప్రసాద్, అభినవ్ మణికంఠ, సోని శ్రీవాస్తవ, ధనలక్ష్మి
దర్శకత్వం : చైతన్య
నిర్మాణం : ఉదయ్ సద్దాల
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం : కిరోన్
కూర్పు : ఉప్పు మారుతీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘సిబిల్ స్కోర్ పెళ్లి కొడుకు’. కథా సుధ నుంచి వచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక కాలేజీ ప్రిన్స్ పాల్ గా వర్క్ చేసే ప్రసాద్ (దేవీ ప్రసాద్) తన జీవితంలో జరిగిన ఓ సంఘటన మూలాన తన కూతురు కావ్య (సోని శ్రీవాస్తవ) కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పెళ్లి కొడుకుకి ఎలాంటి అప్పు అనేది ఉండకూడదు అని వచ్చే పెళ్లి కొడుకుల సిబిల్ స్కోర్ చెక్ చేస్తూ ఉంటాడు. కానీ తన కూతురు మాత్రం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పైగా బాగా అప్పులు ఉన్న కుర్రాడు సూర్య (అభినవ్ మణికంఠ) ని ప్రేమిస్తుంది. సో వీరి ప్రేమకథ గెలిచిందా లేదా? గెలిస్తే అన్ని షరతులు పెట్టుకున్న ప్రసాద్ ని సూర్య ఎలా ఒప్పించాడు? అసలు ఎందుకు ప్రసాద్ అంత కఠినంగా ఉన్నారు అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

డెఫినెట్ గా ఈటీవీ విన్ కథా సుధ సిరీస్ లో ఇది బెస్ట్ లఘు చిత్రాల్లో ఒకటి అని చెప్పొచ్చు. మెయిన్ గా ఇందులో కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ గా రేర్ గా టచ్ చేసిన సబ్జెక్టుగా కనిపిస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో చాలామందికి లింక్ అయ్యే విధమైన పాయింట్ ని దర్శకుడు తీసుకోవడం బాగుంది.

అంతే కాకుండా దానిని తాను అంతే క్లారిటీగా మైంటైన్ చేస్తూ పెద్దగా బోర్ కొట్టించకుండా క్లియర్ కట్ గా ప్రెజెంట్ చేయడం మరో హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో తండ్రి వెర్షన్ లో ఎందుకు అప్పు విషయంలో అంత కఠినంగా ఉన్నారు అనే పాయింట్ ని అలాగే హీరో కోణంలో ఎందుకు అప్పు తీసుకోవాల్సి వచ్చింది అనే పాయింట్ ని దర్శకుడు చాలా బాగా రాసుకొని ప్లాన్ చేయడం దాని అర్ధవంతంగా ఎస్టాబ్లిష్ చేయడం ఇంప్రెస్ చేస్తుంది.

ఇక తమ పాత్రల్లో దేవి ప్రసాద్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి రక్తి కట్టించారు. అలాగే హీరో అభినవ్ కూడా డీసెంట్ పెర్ఫామెన్స్ అందించాడు. హీరోయిన్ సోని శ్రీవాస్తవ అందంగా ఉంది అలానే తన రోల్ లో బాగా చేసింది. ఇక ఇతర నటీనటులు కూడా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో వంకలు పెట్టడానికి పెద్దగా ఏమి లేదు కానీ సినిమా ముగుస్తున్న కొన్ని నిమిషాల కథనం మాత్రం ఇంకాస్త బలంగా ఉండాల్సింది. దేవి ప్రసాద్ హీరో చెల్లెలి పాత్రని కలిసిన దగ్గర నుంచి ఎండింగ్ కి అంతా చాలా సింపుల్ గా ముగించేసినట్టు అనిపిస్తుంది. కొన్ని నిమిషాల సమయం తీసుకొని క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సంగీతం, కెమెరా వర్క్ ఇంకా ఎడిటింగ్ లు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. దర్శకుడు చైతన్య వర్క్ మాత్రం ఇందులో చాలా బాగుంది. చివరి కొన్ని నిమిషాలు పక్కన పెడితే తన విజన్ ఇందులో పర్ఫెక్ట్ గా ఉంది.

తీర్పు:

ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘సిబిల్ స్కోర్ పెళ్లి కొడుకు’ అనే లఘు చిత్రం ఈటీవీ విన్ కథా సుధలో బెస్ట్ లఘు చిత్రాల్లో ఇదీ కూడా ఒకటిగా నిలిచింది. మెయిన్ గా మంచి పాయింట్ ని పట్టుకున్న దర్శకుడు అందులో డీసెంట్ ఎమోషన్ ని మంచి క్లారిటీతో కూడిన రచనతో ఇంప్రెస్ చేశారు. నటీనటులు కూడా పూర్తి న్యాయం చేశారు. సో ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ లో కుటుంబం, యువత కూడా డెఫినెట్ గా చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Exit mobile version