
‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యువహీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా సినిమా ‘సినిమా చూపిస్త మావ’. ‘ఉయ్యాల జంపాల’ లాంటి అందమైన ప్రేమకథలో ఒదిగిపోయిన రాజ్ తరుణ్ – అవికా గోర్ జంట ఈ సినిమాకూ కలిసి నటించడం విశేషం. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ను నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో హీరోయిన్లతో పాటు సినిమా యూనిట్ మొత్తం పాల్గొని సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో రాజ్ తరుణ్ పుట్టినరోజు వేడుక కూడా నిర్వహించారు. రాజ్ తరుణ్ చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకను జరిపారు.