బన్నీ కోసం మొన్న కింగ్.. ఇప్పుడు మరో స్టార్ హీరో.. ఎవరంటే..?

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో విడుదల తేదీ విషయంలో మేకర్స్ ఎలాంటి తొందరపడటం లేదు. మరో మూడు నెలలకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పట్టనుండటమే దీనికి కారణం. ఇక ప్రెగ్నెంట్ అయిన దీపికా పదుకునే సన్నివేశాలను ముందుగా పూర్తి చేసి జాగ్రత్తగా షూట్ ముగిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియో చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ AA23 గురించి వస్తున్న ప్రచారంపైనా స్పష్టత వచ్చింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడనే వార్తలు కేవలం రూమర్లేనని, ఆయన పేరు పరిశీలనలో కూడా లేదని తెలుస్తోంది. అలాగే ‘కూలీ’లో స్పెషల్ సాంగ్ చేసినంత మాత్రాన పూజా హెగ్డేని ఇందులో హీరోయిన్‌గా తీసుకుంటున్నారనడం కూడా నిజం కాదని సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ‘డిసి’ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉండటంతో, మరో నెల రోజుల్లో AA23 పనులను పూర్తి స్థాయిలో వేగవంతం చేయనున్నాడు.

Exit mobile version