‘రామాయణ’తో క్లాష్.. నయన్ అవైటెడ్ సీక్వెల్ కూడా అప్పుడే!

ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గర అవైటెడ్ గా ఉన్నట్టువంటి భారీ చిత్రాల్లో బాలీవుడ్ నుంచి రానున్న సినిమా రామాయణ కూడా ఒకటి. అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్, సాయి పల్లవి తదితరులు తారల కలయికలో ఈ దీపావళికి మ్యాజిక్ చేసేందుకు ఈ సినిమా రాబోతోంది.

అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో దాదాపు క్లాష్ గా మరో సినిమా లేదని చాలా మంది అనుకున్నారు కానీ ఇదే దీపావళి రిలీజ్ కి నయనతార అవైటెడ్ సీక్వెల్ మూకుతి అమ్మన్ తెలుగులో అమ్మోరు తల్లి గా అలరించిన డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీక్వెల్ ని ఇప్పుడు లాక్ చేసారు.

ఈసారి ‘మహాశక్తి’ గా వస్తున్న ఈ సినిమా కూడా దీపావళి బరిలోనే అని కోలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. సో కోలీవుడ్ లో రామాయణ కి గట్టి పోటీ ఈ సినిమా ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక నయన్ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించగా హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. అలాగే ఇషారి కే గణేష్ నిర్మాణం వహించారు.

Exit mobile version