సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత గాథను ఆధారంగా చేసుకుని రూపొందిన హిందీ చిత్రం ‘ఫూలే’. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతీక్ గాంధీ, పాత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. భారత సమాజంలో కుల వివక్ష, లింగ అసమానతలపై ఫూలే దంపతులు సాగించిన పోరాటం, మహిళా విద్యాభివృద్ధి కోసం మరియు పేదల హక్కుల పరిరక్షణ కోసం వారు చేసిన అపారమైన కృషిని ఈ చిత్రం ప్రభావవంతంగా ఆవిష్కరిస్తుంది.
బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో తాజాగా ఏర్పాటు చేశారు. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, లీడర్లు హాజరయ్యారు. వారందరూ ఆర్టీసీ బస్సులో ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు రావడం విశేషం.
