వచ్చే సంక్రాంతి సినిమాలలో విన్నర్ ఎవరంటే?

Mahesh Allu

2020సంక్రాంతికి ఇద్దరు బడా హీరోలు ఒక రోజు వ్యవధిలో బాక్సాఫీస్ పోరుకు దిగనున్నారు. టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మహేష్ సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల అవుతుండగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం అల వైకుంఠపురంలో తదుపరి రోజు అనగా 12న విడుదల అవుతుంది. రజిని కాంత్ దర్బార్ డబ్బింగ్ మూవీ ఐనప్పటికీ ఆయనకున్న స్టార్ డమ్ రీత్యా ఆయన కూడా ఈ ఇద్దరు హీరోలకు గట్టిపోటీనే ఇవ్వనున్నారు. ఐతే ప్రధానంగా పోటీ మాత్రం మహేష్, అల్లు అర్జున్ మధ్య ఉంటుంది. మహేష్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ ఐనప్పటికీ కామెడీ పాళ్ళు కూడా ఎక్కువే అని తెలుస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి గత చిత్రాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. సరిలేరు నీకెవ్వరు మూవీలో మంచి కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయని, ముఖ్యంగా హీరో,హీరోయిన్ల మధ్య నడిచే ట్రైన్ ఎపిసోడ్ లో హిలేరియస్ కామెడీ ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది.

ఇక మాటల మాంత్రికుడు పంచ్ ల కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురంలో కూడా ఆయన మార్కు కామెడీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పూజాతో ఆఫీస్ ఎపిసోడ్స్ మరియు బన్నీ మురళి శర్మల మధ్య మంచి కామెడీ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. కాబట్టి ఎంత సీరియస్ కంటెంట్ ఉన్నప్పటికీ కామెడీ పండించి ప్రేక్షకులను నవ్వించిన వారే సంక్రాంతి విజేతలయ్యే అవకాశం కలదు.ఈ ఏడాది రెండు బడా చిత్రాలను కాదని కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఎఫ్2 చిత్రం విజయం సాధించింది. అలాగే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంతమంచివాడవురా మూవీ కూడా రేసులో ఉంది. మరి మహేష్, బన్నీలలో ఎవరు ప్రేక్షకులను నవ్వించి విజయం అందుకుంటారో చూడాలి.

Exit mobile version