దే’వర’ 2 లేనట్టే..!?

దే’వర’ 2 లేనట్టే..!?

Published on Sep 27, 2026 4:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే దేవర. మంచి వసూళ్లు, తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు పంచిన ఈ సినిమా నేటితో రెండళ్లు పూర్తి చేసుకోవడంతో మేకర్స్ మరోసారి ఈ స్పెషల్ డే ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలుగు స్టేట్స్ లో లిమిటెడ్ గా వేసిన షోస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే మేకర్స్ అప్పట్లో దీనికి పార్ట్ 2 ని కూడా లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత కొన్నాళ్ళు సినిమా ఉందని కూడా అప్డేట్స్ అందించారు. కానీ ఇప్పుడైతే పార్ట్ 2 లేనట్టే అని దాదాపు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇది వరకు సినిమా యూనిట్ నుంచి అప్డేట్స్ లో దేవర 2 కోసం మెన్షన్ చేయలేదు అంటే నార్మల్ అనే అనుకోవచ్చు.

కానీ ఇప్పుడు రెండేళ్ల పోస్ట్ లో కూడా ఇంతకు ముందు వచ్చినట్టు దేవర 2 కోసం ఎలాంటి మెన్షన్ లేదు. సో అఫీషియల్ గా దేవర 2 లేనట్టే అని అనుకోవాలి. గత కొన్నాళ్ల నుంచి ఈ సీక్వెల్ నిలిచిపోయినట్టే అని రూమర్స్ వినిపించాయి. కానీ ఏదొక అప్డేట్ లో చిన్న హింట్ అయినా ఇచ్చేవారు కానీ ఇప్పుడు ముఖ్యమైన రోజు కూడా మిస్ అయ్యింది అంటే సినిమా లేనట్టే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సాలిడ్ వర్క్ అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు