త్రివిక్రమ్ మైథాలజీ చిత్రం.. అసలేం జరుగుతుంది..?

Allu Arjun Trivkram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్వరలో ఓ భారీ మైథాలజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడని.. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర క్రియేట్ అవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని అంతా భావించారు.

కానీ, ఇప్పుడు ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో భారీ మార్పులు జరుగుతున్నాయనే టాక్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

త్రివిక్రమ్ ఈ పౌరాణిక కథను తొలుత అల్లు అర్జున్‌తో చేయాలని ప్లాన్ చేశారట. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. అంతేగాక ఎన్టీఆర్ ఈ సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించిన ఒక పుస్తకాన్ని పట్టుకున్న ఫోటోలు కూడా వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు సీన్ మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రం తిరిగి అల్లు అర్జున్ చేతుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ ఈ సినిమాను బన్నీతోనే పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే హీరోలు లేదా దర్శకుడి నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version