నైజాంలో ‘కూలీ’ డామినేషన్.. డే 3 కూడా ‘వార్ 2’ కి మించే

Coolie vs war2

గత కొన్ని రోజులు కితమే గ్రాండ్ గా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాలే వార్ 2 ఇంకా కూలీ. మంచి హైప్ నడుమ భారీ క్లాష్ తో వచ్చిన ఈ చిత్రాలు మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరింత ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఈ సినిమా అందుకుంది. మరి ఈ రెండు సినిమాలు కూడా డబ్బింగ్ చిత్రాలే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కూలీ డామినేషన్ వేరేగా ఉందని చెప్పాలి.

ముఖ్యంగా నైజాం మార్కెట్ లో వార్ 2 కి మించి డామినేషన్ ని కూలీ చూపిస్తుంది. ఆల్రెడీ డే 2 వసూళ్లు వార్ 2 కంటే ఎక్కువ రాబట్టిన రజిని సినిమా డే 3 కూడా ఇదే ఫీట్ సెట్ చేసింది. నైజాం మార్కెట్ లో డే 3 లెక్కలు చూస్తే 2.65 కోట్ల షేర్ రాబడితే వార్ 2 మాత్రం 1 కోటి తక్కువ అందుకుంది అన్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో వార్ 2 కేవలం 1.65 కోట్ల షేర్ నే అందుకుందట. ఇలా కూలీ ఊహించని డామినేషన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాల్సిందే.

Exit mobile version