నాని నెక్స్ట్ పై క్రేజీ బజ్!

Nani 3

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు చేస్తున్న “ది ప్యారడైజ్” సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత మరింత క్రేజీ లైనప్ ని నాని సిద్ధం చేసుకున్నాడు. వీటిలో దర్శకుడు సుజీత్ తో ‘బ్లడీ రోమియో’ అనే భారీ చిత్రం చేయనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తదుపరి సినిమా కూడా లాక్ అయిపోయినట్టు ఇప్పుడు వస్తుంది.

ఈ కాంబినేషన్ కూడా ఒక ఊహించని కలయికే అన్నట్టు తెలుస్తుంది. ఈసారి నాని దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేయనున్నట్టు టాక్. ఆల్రెడీ నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని ఇప్పుడు వెంకీతో వరుసగా సినిమాలు చేస్తున్న యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కాంబినేషన్ లో దీనినీ లాక్ చేసినట్టు టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version