క్రేజీ బజ్: బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న ‘పెద్ది’ మేకర్స్!?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా కోసం మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎపుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ విషయంలో మేకర్స్ ఇపుడు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

మరి దీని ప్రకారం మేకర్స్ ఛాన్స్ తీసుకోబోతున్నారట. సినిమా ముందు అనుకున్న జూన్ 25 నుంచి ప్రీ పోన్ చేసి జూన్ 4న థియేటర్స్ లో సినిమాని విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అలాగే దీనిపై అఫీషియల్ అప్డేట్ గా పోస్టర్ తో కూడా కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. సో ఇది మాత్రం అభిమానులని బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పి తీరాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version