సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంబీ ప్రొడక్షన్స్ అనే తన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. తన ప్రొడక్షన్ కంపెనీలో తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాడు మహేష్. కాగా ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని నిర్మిస్తూనే మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకుడు అని తెలుస్తోంది. భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు వెంకీ. అయితే వెంకీ కుడుముల మహేష్ తో సినిమా చేయాలని.. మహేష్ ను కలిసి ఓ కథ వినిపించారట. కానీ మహేష్ మాత్రం తన బ్యానర్ లో వేరే హీరోతో ఒక సినిమా చేయమని వెంకీని అడిగినట్టు తెలుస్తోంది. దాంతో వెంకీ కుడుముల కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా ఉన్నాడని సమాచారం. ఎలాగూ వెంకీ కుడుముల అండ్ నవీన్ పోలిశెట్టి అంటే క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.


