విక్టరీ వెంకటేశ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. సెకండ్ హాఫ్ లో వెంకటేశ్ పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో వెంకటేశ్ పాత్ర క్రైమ్ నేపథ్యంలో ఉంటుందట. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఇంటి సెట్ వేస్తున్నారు.
ఈ భారీ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నట్టు త్రివిక్రమ్, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
