స్పెషల్ సాంగ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ?

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్ లేదా బ్రూస్ లీ) పై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. పైగా ఎన్టీఆర్ – రుక్మిణీ వసంత్ లతో పాటు ఇద్దరు హీరోయిన్స్ కూడా స్టెప్స్ వేయనున్నారు.

భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Exit mobile version