‘శర్వానంద్’ ఎంట్రీ సీన్స్ కోసం కసరత్తులు !

Sharwanand

హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా హీరో శర్వానంద్ పై ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ సీక్వెన్స్ కి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ ను కూడా సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ‘మ్యాడ్‌’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్‌ కుమార్‌ హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ బ్యూటీ శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

Exit mobile version