మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ బ్లాస్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో రెండు వారాల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే పెద్ది ప్రమోషన్స్ లేవు అనుకుంటూ బాధ పడుతున్న ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా టీం తాలూకా ప్లానింగ్ టూర్ ఇపుడు వైరల్ గా మారింది.
ఈ 18 ముంబై ఈవెంట్ మొదలు కొని మొత్తం 8 ఈవెంట్స్ ని దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. 18న ముంబై, 22న హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో, 23 భోపాల్, 24 బెంగళూరు, 28 ఢిల్లీ, 30 చెన్నై, 1 విజయనగరం ఫైనల్ గా జూన్ 2వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో వరుసగా పెద్ది నాన్ స్టాప్ పవర్ ప్లే టూర్ ని చేసుకోనున్నాడు. మరి వీటిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి సక్సెస్ అయితే మాత్రం భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.
