కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కీయారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి లాంటి స్టార్ నటీనటుల కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ కోసం అందరికీ తెలిసిందే. చాలా ఆలస్యం అయినప్పటికీ ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం దద్దరిల్లాయి.
కానీ హైప్ కి తగ్గట్టుగా కంటెంట్ లేకపోవడంతో వారం తిరక్కుండానే ఆడియెన్స్ ఈ సినిమాకి మొహం చాటేశారు. ఇక ఈ ఎఫెక్ట్ తో దాదాపు సినిమా ఓటిటి డీల్ కూడా పడిపోయింది. చాలా తక్కువకే జీ 5 సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేయగా ఇక స్ట్రీమింగ్ డేట్ ఇప్పుడు లాక్ అయినట్టుగా తెలుస్తుంది.
జీ 5 వారు పాన్ ఇండియా డేట్ గా ఈ సెప్టెంబర్ 25న రానున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మాత్రం ఫ్యాన్స్ కి ఒకింత గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కానీ అధికారిక క్లారిటీ దీనిపై రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందించగా ఈ కే వి ఎన్ సంస్థ, యష్ లు నిర్మాణం వహించారు.
