తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో వెంకీ అట్లూరికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. పైగా సూర్యతో వెంకీ అట్లూరి తన సినిమాని స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి సూర్య – వెంకీ అట్లూరి నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసాడు.
జీవి ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. అందుకోసం దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారట. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. త్వరలోనే మోషన్ పోస్టర్ తో అధికారికంగా ఈ సినిమాను ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
