క్రేజీ అప్డేట్: ‘జాంబీ రెడ్డి’లోకి రియల్ స్టార్ ఉపేంద్ర.. మ్యాడ్ పోస్టర్ విడుదల

మన టాలీవుడ్ నుంచి రానున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో యువ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సీక్వెల్ సినిమాలు కూడా ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తో హను మాన్ కంటే ముందు చేసిన సినిమా జాంబీ రెడ్డి కి సీక్వెల్ ని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ప్రొజెక్ట్ ఇప్పుడు అంతకంతకు పెద్దదిగా మారుతూ వెళుతుంది. లేటెస్ట్ గా మేకర్స్ కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ సినిమాలో ఉపేంద్ర కూడా నటిస్తున్నట్టుగా తనపై ఓ తలకిందులు పోస్టర్ ని విడుదల చేసారు.

వినూత్నతకు మారుపేరు అయిన ఉపేంద్రకి తగ్గట్టుగా తన నుంచి ఏం ఆశిస్తారో అలా దర్శకుడు సుప్రన్ ఎస్ వర్మ డిజైన్ చేయడం సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించింది. దీనితో జాంబీ రెడ్డి 2 పై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతం షూట్ శరవేగంగా జరుపుకుంటుంది.

Exit mobile version