
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం క్లైమాక్స్. రాజేంద్ర ప్రసాద్ నెగెటివ్ షేడ్స్ కలిగిన ఛాలెంజింగ్ రోల్ చేస్తుండగా… శశ సింగ్, శ్రీరెడ్డి, శివ శంకర్ మాస్టర్ మరియు పృథ్వి ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన క్లైమాక్స్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఆసక్తికర అంశాలతో, ఉన్నత నిర్మాణ విలువలతో కూడిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఇక దర్శకుడు భవాని శంకర్ కె… క్లైమాక్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో భవాని శంకర్ డ్రీమ్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించగా పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఇక క్లైమాక్స్ చిత్రం ఓ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ గా తెలుస్తుండగా, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు కూడా జోడించారని సమాచారం.
కాగా క్లైమాక్స్ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఫిబ్రవరి 27న క్లైమాక్స్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం రాజేష్, నీద్వాన అందించారు.