“మన శంకర వరప్రసాద్ గారు” ట్రైలర్ పై ఫ్యాన్స్ ఆసక్తి !

మన శంకర వరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Varaprasad Garu) అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా 2026 సంక్రాంతికి ఈ సినిమాని తీసుకురానున్నారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించడానికి సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం, అందరి దృష్టి ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానున్న ట్రైలర్‌ పై ఉంది. ముఖ్యంగా చిరంజీవి పాత్ర గురించి, అలాగే సినిమా కంటెంట్ పై స్పష్టమైన అవగాహన కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 30 సెకన్లుగా రాబోతుంది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఎలా అందుకోబోతుందో చూడాలి.

Exit mobile version