తిరుపతిలో ‘కరెంటు తీగ’ షూటింగ్..!

current
మంచు మనోజ్, రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కరెంటు తీగ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. నిన్నటివరకు హైదరాబాద్లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్ నేడు తిరుపతి చేరుకుంది. మంచు మనోజ్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ లపై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

అచ్చు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నారు. టైటిల్ కి తగ్గట్టు మనోజ్ ఎనర్జిటిక్ పాత్రలో సందడి చేయనున్నారు. సన్నీ లియోన్ ఈ చిత్రంలో ప్రత్యెక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాకుల్ ప్రీత్ సింగ్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. సన్నీ లియోన్ ప్రత్యెక గీతం, ఆమె నటించిన సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణ.

Exit mobile version