దాదా టైటిల్ గ్లింప్స్ టాక్: థియేటర్స్ లో బ్లాస్ట్ ఖాయం.. ఊరమాస్ స్టఫ్ తీసుకొస్తున్న వీర సింహా రెడ్డి కాంబో

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వీరసింహా రెడ్డి తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడం పైగా బాలయ్యని ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా ప్రెజెంట్ చేస్తుండడంతో హైప్ మరింత బిల్డ్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా మేకర్స్ సినిమా టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేసారు.

సినిమాకి దాదా అంటూ ఖరారు చేసి బాలయ్యని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేశారు. సాలిడ్ మ్యానరిజంలు సెటిల్డ్ మాస్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు అని చెప్పవచ్చు. ఇక ఈ గ్లింప్స్ లో కెమెరా వర్క్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉందని చెప్పొచ్చు. ముంబైలో నైట్ షూట్ లో బాలయ్య పై ఓ ఫ్రేమ్ అయితే అదిరిపోయింది. ఇక థమన్ కూడా బాలయ్యకి మరోసారి మ్యాడ్ వర్క్ అందించాడు.

ఇలా చిత్ర యూనిట్ అంతా కలిసి ఒక మాస్ బ్లాస్ట్ ని థియేటర్స్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ 24న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసేసారు. ఈ సినిమాకి నిర్మాణ సంస్థ వృద్ది సినిమాస్ వారు అందించిన నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఇందులో కనిపించడం విశేషం.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version