పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గా ఉన్న సమయంలో చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు కరుణాకరన్ తో చేసిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం డార్లింగ్ కూడా ఒకటి. తన ఖాతాలో ఒక క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఈ కొన్ని రోజులు కితమే మళ్ళీ గ్రాండ్ గా రీరిలీజ్ కి వచ్చింది.
అయితే రెండు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 2 రోజులలో మన తెలుగు సినిమా దగ్గర భారీ నంబర్స్ ని సెట్ చేసినట్టు తెలుస్తుంది. మొదటి రోజే 7 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజుకి 2 కోట్లకి పైగా క్రాస్ చేసి మొత్తం 9.36 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు తెలుస్తుంది. దీనితో రీజనల్ భాషల సినిమాల్లో డార్లింగ్ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కాజల్ ప్రభాస్ సరసన నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే చంద్రమోహన్, ప్రభు తదితరులు ఈ సినిమాలో నటించారు.


