మనోజ్ ని కొత్తగా చూపించనున్న దశరథ్

Manchu-Manoj-and-Dasarath

అటు కామెడీ, ఇటు ఇంటెన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేయగల యంగ్ హీరో మంచు మనోజ్. మంచు మనోజ్ మొదటి సారిగా ఓ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సున్నితమైన భావోద్వేగాలతో చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసే దశరథ్ మరో సారి మంచు మనోజ్ తో కలిసి పని చేయనున్నాడు. ఇటీవలే ‘సూర్య vs సూర్య’ సినిమాతో తొలి సక్సెస్ ని అందుకున్న నిర్మాత మాల్కాపురం శివకుమార్ ఈ సినిమాని నిర్మించనున్నాడు.

ఈ సినిమాలో దశరథ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే మనోజ్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని అంటున్నారు. అంతే కాకుండా మనోజ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేసేలా దశరథ్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా జూన్ రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మంచు మనోజ్ – ప్రణతిల వివాహ మహోత్సవం మే నెల 20న జరగనుంది. ఈ పెళ్లి కారణంగా మనోజ్ ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఇది కాకుండా మంచు మనోజ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న ‘అటాక్’ సినిమా సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటిస్తుంటే, జగపతి బాబు, వడ్డే నవీన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version