150వ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు మెగాఫోన్ పట్టుకోనున్నాడు. ఇటీవలే తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘మంజపై’ సినిమా రీమేక్ రైట్స్ ని దాసరి కొనుక్కున్నారు. ఈ సినిమాని తెలుగులో ‘ఎర్రబస్సు’ పేరుతో తెరకెక్కించనున్నారు. మంచు విష్ణు హీరోగా, కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 28నుంచి మొదలు కానుంది.
తాత – మనవడు మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాతయ్య పాత్రకి ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం దాసరి నారాయణరావు ఆ పాత్ర చెయ్యడానికి సిద్దమయ్యాడు. దీని ప్రకారం ఎర్రబస్సులో దాసరి విష్ణుకి తాతయ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి విశేషాలు త్వరలో అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.
