దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి తన సహృదయతను చాటుకున్నారు. ప్రజలకు సహాయం చేయడంలో ముందుండే దాసరి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసిన హుధూద్ తుఫాన్ భాదితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తుఫాన్ వల్ల నష్టపోయిన మూడు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ మూడు కుటుంబాల పునరావాసానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పారు.
ఇప్పటికే తెలుగు సినిమా ప్రముఖులు పెద్ద ఎత్తున తుఫాన్ భాదితుల కోసం విరాళాలు ఇచ్చారు. తమను ఆదరించిన ప్రేక్షకులు కష్టాలలో ఉండడం చూసి మనసు చలించిపోయిన వీరంతా విరాళాలు ఇవ్వడంతో పాటు స్వయంగా సహాయక చర్యలలో పాల్గొంటున్నారు.
