మన టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి నుంచి గత ఏడాది ఘాటీ సినిమా వచ్చి ఆడియెన్స్ ని పలకరించింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించలేదు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమే అంతా ఎదురు చూస్తుండగా ఈసారి అనుష్క ఒక సాలిడ్ హారర్ థ్రిల్లర్ తో ఆడియెన్స్ ని పలకరించేందుకు సిద్ధం అయ్యింది. మరి ఆ చిత్రమే ‘కథానార్’. దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్ గ్లింప్స్ పై ఇప్పుడు ఓ ఆసక్తికర పోస్టర్ తో అనుష్క అప్డేట్ ఇవ్వడం జరిగింది.
ఈ సినిమా నుంచి ఈ మార్చ్ 31న మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాలకి ఆ అప్డేట్ రివీల్ చేస్తున్నట్టు రివీల్ చేశారు. మరి ఈ పోస్టర్ చూస్తుంటే హారర్ ఎలిమెంట్స్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో జయసూర్య, ప్రభుదేవా తదితరులు నటిస్తుండగా శ్రీ గోకులం మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
