షాకింగ్: ‘ధురంధర్ 2’ తెలుగు షోస్ రద్దు!

Dhurandhar

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “ధురంధర్ 2”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో ఈ ఉగాది, ఈద్ కానుకగా విడుదలకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా మీద ఉన్న నమ్మంతో ఎప్పుడో ఇండియా వైడ్ గా ప్రీమియర్స్ వేస్తూ బుకింగ్స్ ఓపెన్ చేసేసారు. ఇందులో తెలుగు వెర్షన్ కూడా ఉన్నాయ్. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున షోస్ ప్లాన్ చేయగా అవన్నీ దాదాపు అమ్ముడుపోయాయి.

సరే ఈ సాయంత్రం నుంచి సినిమా చూడొచ్చు అనుకుంటే తెలుగు ఆడియెన్స్ కి ఊహించని షాక్ ఇపుడు తగిలింది. ఇండియా వైడ్ గా తెలుగు షోస్ రద్దయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం ఇంకా కంటెంట్ డెలివరీ కాకపోవడమే అని తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ ప్లాన్ చేసిన తెలుగు ప్రీమియర్ షోస్ కూడా రద్దు చేస్తున్నట్టు మెసేజ్ లు కూడా వెళుతున్నాయి. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూసిన తెలుగు ఆడియెన్స్ మాత్రం బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.

Exit mobile version