కె ర్యాంప్ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్

KRAMp
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె ర్యాంప్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జెయిన్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ ర్యాంపేజ్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే ట్యాగ్‌లైన్‌తో మూవీ తెరకెక్కడమే దీనికి నిదర్శనం.

ఇక రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ వీడియో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఒకింత మంచి బజ్ క్రియేట్ చేశాయి. కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు చేయని జోనర్‌లో ఈ సినిమాను చేస్తున్నాడని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘ఓనమ్’ పాటను ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మరి ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలి.

Exit mobile version