అఫీషియల్ : ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే…?

Nagarjuna

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్ రానే వచ్చింది. కింగ్ నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న ఆయన మైల్‌స్టోన్ చిత్రం ‘కింగ్ 100’ కి సంబంధించిన బిగ్ అప్‌డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ‘కింగ్ 100 గ్లింప్స్’ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద విజయోత్సవాల జోష్ మీదున్న అక్కినేని కాంపౌండ్ నుంచి రాబోతున్న ఈ సినిమా గ్లింప్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ గ్లింప్స్‌తో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా, డిసెంబర్ రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version