పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన అవైటెడ్ హారర్ ఫాంటసీ చిత్రమే ది రాజా సాబ్. మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన అన్ని పాటలు కూడా ఆడియెన్స్ ని అలరించాయి. ఇక నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి థమన్ డేట్ ని రివీల్ చేసేసాడు.
అంతే కాకుండా ఇందులో ప్రభాస్ స్టైలింగ్, కాస్ట్యూమ్స్ కూడా అదిరిపోతాయని చెబుతున్నాడు. నాచో నాచో అంటూ సాగే నెక్స్ట్ సాంగ్ ని ఈ జనవరి 5న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. నాచో నాచో అంటే ఇది మంచి డాన్స్ నెంబర్ లా వినిపిస్తోంది. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ లో డార్లింగ్ స్టెప్పులు చూసి వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూశామని ఫ్యాన్స్ చెప్పారు. ఇక మరోసారి అదే తరహాలో అంటే ఇది మరింత ర్యాంపేజ్ ని సెట్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జనవరి 9న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.
#NacheNache on 5 th ❤️????????
Prabhas anna costumes and styling ????????????????????????????????????
— thaman S (@MusicThaman) January 3, 2026
