ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డులకు చెక్ పెట్టేది ఆ రోజే..!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పవన్-హరీష్ కాంబో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ను మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. చేతిలో గన్ పట్టుకుని పవర్ స్టార్ పూర్తి యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ పోస్టర్ అభిమానులను థ్రిల్ చేస్తోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ కట్‌ను హరీష్ శంకర్ ఎలా తీర్చిదిద్దాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version