రాజంపేటలో ‘డేవిడ్‌ రెడ్డి’ క్లైమాక్స్ !

David-Reddy-1

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘డేవిడ్‌ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగనున్న ఈ క్లైమాక్స్ కోసం.. రాయలసీమలోని రాజంపేటలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు మనోజ్ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయ

ఇక ‘డేవిడ్‌ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్‌ వారిపై పోరాడిన ‘డేవిడ్‌ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్‌ డాగ్‌’ అనే బైక్‌ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్‌ సరసన ‘ప్రిన్స్‌’ (కోలీవుడ్‌ మూవీ) హీరోయిన్‌ మరియా నటించబోతుంది.

Exit mobile version