దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథపై కసరత్తులు చేస్తున్నారు. ఎన్టీఆర్ కి భుజం గాయం కారణంగా షూటింగ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. ఈ మధ్యలో త్రివిక్రమ్ స్క్రిప్ట్ బెటర్ మెంట్స్ పై వర్క్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని ఓ భారీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా త్రివిక్రమ్ విఎఫ్ఎక్స్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారట.
‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా కావడం, పైగా తారక్ కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు ఉండటం, అన్నిటికీ మించి మైథలాజికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. త్రివిక్రమ్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా.
కాగా సుబ్రహ్మణ్య స్వామి కథతో పాటు.. సుబ్రహ్మణ్య స్వామి పాత్రలోని దైవత్వాన్ని బలంగా చూపించే విధంగా త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది.
