ఘనంగా ‘డియర్ ఉమా’ ట్రైలర్ లాంఛ్.!

dear uma 3

మన తెలుగు సినిమా దగ్గర ఇపుడు తెలుగు హీరోయిన్స్ ఉండటమే కష్టం అవుతున్న సమయంలో తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన సినిమానే ‘డియర్ ఉమ’. ఈ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.

మొదటిగా సుమయ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మంచి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించాలని అనుకున్నాను. కథ రాస్తూ ఉండగా ఎంతో కంటెంట్ వచ్చేది. రాజేష్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఆయన తన కథలన్నీ పక్కన పెట్టి నా కథ మీద దృష్టి పెట్టారు. అయితే నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తారా అని అనుకున్నాను. అప్పుడు మా అమ్మ నన్ను సపోర్ట్ చేశారు. నాకు సంగీతం చాలా ఇష్టం. రధన్ గారు చేసిన అందాల రాక్షసి పాటలు చాలా ఇష్టం. అసలు రధన్ గారు మా సినిమాని ఒప్పుకుంటారా? లేదా? అని అనుకున్నాను. కథ చెప్పిన వెంటనే ఆయన ఓకే అన్నారు. నన్ను నమ్మి హీరోగా చేసిన పృథ్వీ గారికి థాంక్స్. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా విజయం వెనుక నా టీం ఉంది. ఏప్రిల్ 18న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

అలాగే పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. ‘తెలుగులో దియా తరువాత నా మీద ఇక్కడ ఫాలోయింగ్ పెరిగింది. నాగేశ్ వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. సుమయ గారు ఈ సినిమాను రాశారు.. నిర్మించారు.. హీరోయిన్‌గా నటించారు. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఎంతో కూల్‌గా ఉండేవారు. ఇది నా మొదటి తెలుగు సినిమా అవ్వడం నాకు ఆనందంగా ఉంది. రధన్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఏప్రిల్ 18న రాబోతోన్న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మాట్లాడుతూ.. ‘డియర్ ఉమ చిత్రానికి మీడియా నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. ఈ మూవీని సుమయ గారు భుజానికి ఎత్తుకుని చేశారు. ఆమెకున్న ప్యాషన్‌ చూసే ఈ మూవీని నేను చేసేందుకు ముందుకు వచ్చాను. దర్శకుడు ఎన్ని కష్టాలు ఎదురైనా చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రానికి మంచి పాటలు వచ్చాయి. ఆర్ఆర్ బాగుంటుంది. ప్రతీ ఒక్కరూ సినిమా సక్సెస్ కోసమే పని చేస్తారు. మా చిత్రాన్ని ఏప్రిల్ 18న అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

నటుడు కమల్ కామరాజ్ మాట్లాడుతూ.. ‘సుమయ వల్లే డియర్ ఉమ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. నాకు ఈ చిత్రంలో మంచి పాత్రను ఇచ్చారు. ఏప్రిల్ 18న అందరూ మా సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సుమయ రెడ్డి తల్లి జ్యోతి రెడ్డి మాట్లాడుతూ.. ‘డియర్ ఉమ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. నా కూతరు హీరోయిన్‌గా, రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాను చేసింది. కథ రాస్తున్నాను అని చెప్పినప్పుడు సరే అన్నాను. కానీ ఇంత వేగంగా స్క్రీన్ మీదకు వస్తుందని అనుకోలేదు. ఏప్రిల్ 18న మా చిత్రాన్ని చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు.

Exit mobile version